challange
challange
challange

అనేక ఇంజెక్షన్లు అంటే అనేకసార్లు ఏడుపులు మరియు అసౌకర్యం కావున, ఇప్పటి తల్లులు టీకా మిశ్రమాన్ని ఎంచుకుంటున్నారు మరియు దానివలన కలిగే ‘నొప్పి’ని తగ్గిస్తున్నారు. అంతకంటే ఇంకేం కావాలి, అనేక ఎంపికలలో మిశ్రమ టీకా దొరుకుతోంది, కేవలం 1 ఇంజెక్షనుతో క్రింద పేర్కొన్న 3 నుండి 6 వ్యాధులకు రక్షణనిస్తోంది.

మిశ్రమ టీకా గురించి ప్రతి తల్లి ఏమి తెలుసుకోవలసి ఉంటుంది

మిశ్రమ టీకా అంటే ఏమిటి?
మిశ్రమ టీకా వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి?
నా బిడ్డ ఎప్పుడు మిశ్రమ టీకాను పొందాలి?
క్రింద పేర్కొన్న 6 వ్యాధుల కొరకు అందుబాటులో ఉన్న వివిధ రకాల మిశ్రమ టీకాలు ఏమిటి?
వేర్వేరు టీకాలతో పోలిస్తే మిశ్రమ టీకా వలన ఏవైనా అదనపు దుష్ప్రభావాలు ఉంటాయా?

డిఫ్తీరియా

డిఫ్తీరియా అనగా ఏమిటి మరియు నా బిడ్డకు అది ఎలా సోకుతుంది?
డిఫ్తీరియా అనేది ఒక ప్రమాదకరమైన బ్యాక్టీరియా సంక్రమణ, ఇది సాధారణంగా ముక్కు మరియు గొంతు యొక్క శ్లేష్మపొరలను ప్రభావితం చేస్తుంది. డిఫ్తీరియా వీటి ద్వారా వ్యాపిస్తుంది:

సంక్రమణకు గురైన వ్యక్తి దగ్గు లేదా తుమ్ముల నుండి శ్వాసకోశ నీటి చుక్కలు.

డిఫ్తీరియాను కలిగించే బ్యాక్టీరియాను కలిగి ఉన్న కలుషితమైన వ్యక్తిగత లేదా గృహసంబంధ వస్తువులు – బొమ్మ వంటి వస్తువును ముట్టుకోవడం ద్వారా కూడా బిడ్డకు డిఫ్తీరియా రావచ్చు.

నా బిడ్డకు డిఫ్తీరియా వస్తే ఏమి జరుగుతుంది?
డిఫ్తీరియా లక్షణాలలో బలహీనత, గొంతురాపిడి, జ్వరం మరియు మెడలోని గ్రంథుల వాపు ఉంటాయి. గొంతులో ఒక మందపాటి పొర ఏర్పడుతుంది, అది ఊపిరితీసుకోవడంలో లేదా మింగడంలో ఇబ్బందికి దారితీయవచ్చు. గాలి మార్గం అవరోధం, గుండె దెబ్బతినడం, నరాలు దెబ్బతినడం, ఊపిరితిత్తుల సంక్రమణ మరియు పక్షవాతం వంటి ఉపద్రవాలకు ఇది దారితీయవచ్చు.

డిఫ్తీరియా నుండి నా బిడ్డను నేను ఎలా కాపాడుకోవాలి?

డిఫ్తీరియాను టీకాతో నివారించవచ్చు. డిఫ్తీరియా టీకాను సాధారణంగా ధనుర్వాతం మరియు కోరింతదగ్గు(పెర్టుసిస్) కొరకు గల టీకాలతో కలుపుతారు. పసితనంలో డాక్టర్లు సిఫారసు చేసే బాల్యపు వ్యాధినిరోధకతలలో ఇతర యాంటిజెన్ల మిశ్రమంతో డిఫ్తీరియా టీకా ఒకటిగా ఉంది.

అనారోగ్యాన్ని కలిగి ఉన్న ఎవరైనా వ్యక్తి నుండి బిడ్డను దూరంగా ఉంచడంతో సహా ప్రతి ఒక్కరూ అన్ని పరిశుభ్రమైన ముందుజాగ్రత్తలను తీసుకోవలసి ఉంటుంది.

తిరిగి వెళ్ళండి

కోరింతదగ్గు:

కోరింతదగ్గు అనగా ఏమిటి మరియు నా బిడ్డకు అది ఎలా రావచ్చు?

కోరింతదగ్గు (దీనిని ఊపింగ్ కఫ్ అని కూడా అంటారు) అనేది అత్యంత సాంక్రమిక శ్వాసకోశ సంక్రమణ, ఇది ప్రమాదకరంగా, ముఖ్యంగా నవజాత శిశువులు మరియు చిన్నపిల్లలలో ఉండవచ్చు.

సాంక్రమిక ఉమ్మి చుక్కలచే గాలి ద్వారా కోరింతదగ్గు వ్యాపిస్తుంది, అందుచే ఇతర వ్యక్తుల దగ్గు లేదా తుమ్ములు లేదా వ్యాధితో ఉన్న వ్యక్తికి సన్నిహితంగా ఉండడం వలన ఇది తేలికగా సంక్రమించవచ్చు. నవజాత శిశువులకు కోరింతదగ్గు సంక్రమణకు తల్లులు ముఖ్యమైనమూలంగా ఉంటారు.

నా బిడ్డకు కోరింతదగ్గు వస్తే ఏమవుతుంది?

కోరింతదగ్గు ప్రమాదకరమైన మరియు కొన్నిసార్లు ప్రాణాంతకమైన ఉపద్రవాలను చిన్నపిల్లలు మరియు 2 నెలల కన్నా తక్కువ వయసు గల పసిపిల్లలలో కలుగవచ్చు. చిన్నపిల్లలు మరియు శిశువులు బాధను కలిగి ఉండవచ్చు మరియు ఊపిరితీసుకోవడంలో ఇబ్బంది కారణంగా నీలంగా కావచ్చు.

కోరింతదగ్గు నుండి నా నవజాతశిశువును కాపాడడానికి గల మార్గాలు ఏమిటి?

శిశువుకు టీకాను వేయడం ద్వారా కోరింత దగ్గును నివారించవచ్చు. పసిపిల్లలలో కోరింత దగ్గును నివారించడానికి గల ఇతర విధానాలలో తల్లులకు, కుటుంబ సభ్యులకు మరియు ఇతర సన్నిహతమైన వారికి టీకాలను వేయడం కూడా ఉంది. మరిన్ని వివరాల కొరకు దయచేసి మీ డాక్టరును సంప్రదించండి.

తిరిగి వెళ్ళండి

ధనుర్వాతం

ధనుర్వాతం అనగా ఏమిటి మరియు నా బిడ్డకు అది ఎలా కలుగుతుంది?

ధనుర్వాతం అనేది ఒక ఆకస్మిక, తరచుగా ప్రాణాంతకమైన వ్యాధి, ఇది బ్యాక్టీరియమ్ క్లోస్ట్రిడియమ్ టెటానీ వలన కలుగుతుంది. అస్థిపంజర కండరాల బిగువు మరియు ఈడ్పులచే ఇది కలుగుతుంది.

దవడ (లాక్‌జా) మరియు మెడతో ప్రమేయం గల కండరాల బిగువును సాధారణంగా ఇది కలిగిస్తుంది మరియు తరువాత మొత్తం శరీరానికి వ్యాపిస్తుంది.

మట్టి, దుమ్ము మరియు పేడలో బ్యాక్టీరియా బీజాంశాలు సాధారణంగా కనుగొనబడతాయి మరియు కలుషితమైన పదార్థాలచే కలిగిన కోతలు లేదా రంధ్రాలు పడిన గాయాల వంటి చర్మంలోని పగుళ్ళ ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి.

నా బిడ్డకు ధనుర్వాతం సోకితే ఏమి జరుగుతుంది?

పసిపిల్లల ధనుర్వాతంలో, కండర బిగువుల వంటి లక్షణాలు కలుగవచ్చు, ఇవి తరచుగా నవజాత శిశువు పాలను పీల్చడంలో లేదా చనుబాలను త్రాగడంలో అసక్తత మరియు విపరీతంగా ఏడవడం ఉండవచ్చు.

కొద్దిగా పెద్దవయసులోని పిల్లలు మరియు వయోజనులలో, ఇది దవడ బిగువు, కండరాలు నొప్పితో బిగుసుకుపోవడం మరియు మూర్ఛలకు దారితీయవచ్చు. ఇది ఎముకలు విరగడం, ఊపిరితీసుకోవడంలో ఇబ్బంది, స్వరతంత్రులలో ఈడ్పు వంటి ఉపద్రవాలకు దారితీయవచ్చు.

ధనుర్వాతం నుండి నా నవజాత శిశువును కాపాడడానికి గల మార్గాలు ఏమిటి?

ధనుర్వాతం సంక్రమణను నివారించడానికి టీకా మరియు గాయానికి సరైన సంరక్షణను సిడిసి సిఫారసు చేస్తుంది. ఎవరైనా ప్రమాదకరంగా గాయపడినప్పుడు మరియు ధనుర్వాతం టీకాలతో రక్షణ పొందకపోతే, ధనుర్వాతం నివారణకు సహాయకంగా డాక్టర్లు ఒక మందును కూడా ఉపయోగించవచ్చు.

తిరిగి వెళ్ళండి

పోలియో

పోలియో అంటే ఏమిటి మరియు పిల్లలకు ఇది ఎలా వస్తుంది?

పోలియో అనేది అత్యంత సాంక్రమికమైన వ్యాధి, ఇది వైరస్ వలన కలుగుతుంది. ఇది నాడీవిధానం సంక్రమణకు గురయ్యేట్టు చేస్తుంది మరియు పక్షవాతాన్ని, ఊపిరితీసుకోవడంలో ఇబ్బంది మరియు కొన్నిసార్లు మరణాన్ని కూడా కలిగించవచ్చు. 5 సంవత్సరాల కన్నా తక్కువ వయసు గల పిల్లలలో ప్రధానంగా పోలియో ప్రభావితం చేస్తుంది మరియు అత్యంత సాంక్రమికమైనది.

మల-మార్గం లేదా ఒకే వాహనం ద్వారా ఒక వ్యక్తి-నుండి-వేరొక వ్యక్తికి సంక్రమిస్తుంది(ఉదాహరణకు, కలుషితమైన నీరు లేదా ఆహారం). మరియు, వారి నోటిలో కలుషితమైన బొమ్మలవంటివి మీ బిడ్డ నోట్లో పెట్టుకుంటే, వారు సంక్రమణకు గురికావచ్చు.

నా బిడ్డకు పోలియో వస్తే ఏమి జరుగుతుంది?

సిడిసి ప్రకారం, పోలియో వైరస్ గల 4 మంది వ్యక్తులలో 1రికి ఫ్లూ వంటి లక్షణాలు ఉండవచ్చు, వీటిలో గొంతురాపిడి, జ్వరం, అలసట, వికారం, తలనొప్పి మరియు కడుపులో నొప్పి ఉన్నాయి. కొంతమంది రోగులలో మెదడు మరియు వెన్నెముకతో కూడిన లక్షణాలు వృద్ధి చెందవచ్చు. పోలియోతో కలిగే అత్యంత తీవ్రమైన లక్షణంలో పక్షవాతం ఉంది. ఇది శాశ్వతమైన వైకల్యం మరియు మరణానికి దారితీయవచ్చు.

పోలియో నుండి నా నవజాత శిశువును కాపాడడానికి గల మార్గాలు ఏమిటి?

పోలియోను నివారించడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గం టీకా. పోలియోకు వ్యతిరేకంగా టీకా గురించి మరింత సమాచారంను పొందడానికి మీ డాక్టరుతో మాట్లాడండి.

తిరిగి వెళ్ళండి

హెమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా
టైప్ బి (హెచ్ఐబి)

హెమోఫీలస్ ఇన్ఫ్లుయెంజా టైప్ బి అనగా ఏమిటి మరియు నా బిడ్డకు అది ఎలా సోకుతుంది?

హెమోఫీలస్ ఇన్ఫ్లుయెంజా అనేది హెచ్.ఇన్ఫ్లుయెంజా అని పిలవబడే బ్యాక్టీరియాచే కలుగుతుంది.

పేరులో హెచ్.ఇన్ఫ్లుయెంజా ఉన్నప్పటికీ ఇది ఇన్ఫ్లుయెంజాను కలిగించదు (ఫ్లూ). హెమోఫీలియా ఇన్ఫ్లుయెంజా అనేది టైప్ బి (హెచ్ఐబి) బ్యాక్టీరియా, దీనివలన తేలికపాటి చెవి సంక్రమణల నుండి తీవ్రమైన న్యుమోనియా, మెనింజైటిస్ మరియు ఇతర హానికరమైన వ్యాధుల యొక్క వివిధ రకాలు ప్రధానంగా 5 సంవత్సరాల కన్నా తక్కువ వయసు గల పిల్లలో కలుగవచ్చు.

ఇతరులతో సన్నిహితంగా ఉన్నప్పుడు దగ్గు లేదా తుమ్ములతో హెచ్.ఇన్ఫ్లుయెంజాను ఇతరులకు సంక్రమింపచేయవచ్చు. అనారోగ్యాన్ని కలిగి లేని వ్యక్తులు కూడా వారి ముక్కులు మరియు గొంతులలో బ్యాక్టీరియాను కలిగి ఉండవచ్చు మరియు బ్యాక్టీరియాను వ్యాపింపచేయవచ్చు.

నా బిడ్డకు హెచ్ఐబి వస్తే ఏమవుతుంది?

న్యుమోనియా, రక్తప్రవాహ సంక్రమణ మరియు నాడీమండల శోథ (మెనింజైటిస్) వంటివి హెచ్ఐబి ద్వారా కలిగే అత్యంత సాధారణమైన హానికర వ్యాధులుగా ఉన్నాయి. నాడీమండల శోథ అనేది మెదడు మరియు వెన్నెముక పొర సంక్రమణగా ఉంటుంది. ఇది మొదటి అధిక జ్వరం, తలనొప్పి, తక్కువగా తినడం మరియు త్రాగడంతో కలిగి ఉంటుంది.

సిడిసి ప్రకారం, హెచ్ఐబి హానికారక వ్యాధితో ఉన్న చాలామంది పిల్లలకు ఆసుపత్రిలో సంరక్షణ అవసరం అవుతుంది. చికిత్సతో కూడా, 20 మంది పిల్లలలో 1రు హెచ్ఐబి మెనింజైటిస్‌తో మరణిస్తారు. 5 మంది పిల్లలలో కనీసం 1రు అయినా హెచ్ఐబి మెనింజైటిస్ వలన మెదడు దెబ్బతినడం లేదా చెవిటితనంకు గురికావచ్చు.

పోలియో నుండి నా నవజాత శిశువును కాపాడుకోవడానికి మార్గాలు ఏమిటి?

ప్రమాదకరమైన హెచ్ఐబి వ్యాధి నివారణ చాలావరకు టీకా ద్వారా సాధ్యమని డబ్ల్యుహెచ్ఓ సిఫారసు చేస్తుంది. బాల్యదశలో ఇచ్చినప్పటికీ హెచ్ఐబి టీకాలు సురక్షితం మరియు ప్రభావవంతమైనవని పరిగణించబడుతుంది.

తిరిగి వెళ్ళండి

హెపటైటిస్ బి

హెపటైటిస్ బి అంటే ఏమిటి మరియు నా బిడ్డకు అది ఎలా సోకుతుంది?

హెపటైటిస్ బి అనేది కాలేయ సంక్రమణ, ఇది రక్తం మరియు శరీర ద్రవాల ద్వారా వైరస్ వ్యాపించి కలుగుతుంది. హెపటైటిస్ బి ఒక స్వల్పకాలిక అనారోగ్యం నుండి ప్రమాదకరమైన, జీవితాంతం ఉండే అనారోగ్యంగా పిల్లలలో కలుగవచ్చు. ఇది తరచుగా అనేక సంవత్సరాల పాటు ఉంటుంది మరియు కాలంతో పాటు ప్రమాదకరమైన కాలేయ హానిని కలుగచేయవచ్చు.

సంక్రమణకు గురైన తల్లి సంక్రమణను ప్రసవ సమయంలో బిడ్డకు ప్రసరింపచేయవచ్చు. హెపటైటిస్ బి వైరస్ తో సంక్రమణకు గురైన రక్తం, వీర్యం, లేదా ఇతర శరీర ద్రవం సంక్రమణకు గురికాని వ్యక్తి శరీరంలోకి ప్రవేశిస్తే హెపటైటిస్ బి వైరస్ వ్యాపిస్తుంది.

నా బిడ్డకు హెపటైటిస్ బి ఉంటే ఏమవుతుంది?

సిడిసి ప్రకారం, 5 సంవత్సరాలు మరియు అంతకన్నా వయసు ఉన్నసుమారు 30%-50% మంది ఆకస్మిక కాలేయశోథ లక్షణాలను కలిగి ఉన్నారు. 5 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న చాలామంది పిల్లలు మరియు వ్యాధినిరోధకత క్షీణించడం వంటి ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలతో ఉన్న వ్యక్తులు, ఏ లక్షణాలను కలిగిలేరు.

హెపటైటిస్ బి లక్షణాలలో అలసట, జ్వరం, ఆకలి లేకపోవడం, వికారం, చర్మం లేదా కళ్ళు పసుపురంగులో మారడం, పొత్తికడుపు నొప్పి మరియు మూత్రం ముదురురంగులో రావడం ఉన్నాయి.

సంక్రమణకు గురైన సుమారు 90% మంది నవజాత శిశువులలో (అనగా. 1 సంవత్సరం కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలలో) దీర్ఘకాలిక సంక్రమణ వృద్ధి చెందుతుంది. సంక్రమణకు గురైన 1 మరియు 5 సంవత్సరాల మధ్య వయసు గల సుమారు 25%–50% మంది పిల్లలలో హెపటైటిస్ బి వృద్ధి చెందుతుంది.

దీర్ఘకాలిక హెపటైటిస్ బి వలన కాలేయం దెబ్బతినడం, కాలేయంలో రంధ్రాలు పడటం, కాలేయ క్యాన్సర్ మరియు మరణం కూడా సంభవించవచ్చు.

హెపటైటిస్ బి నుండి నా నవజాతశిశువును కాపాడడానికి గల మార్గాలు ఏమిటి?

సిడిసి ప్రకారం, టీకా తీసుకోవడం ద్వారా హెపటైటిస్ బిను నివారించడం ఉత్తమమైన మార్గంగా ఉంది. పూర్తి పరిరక్షణ కొరకు షాట్స్ సిరీస్ పూర్తిచేయవలసి ఉంది. 21 హెపటైటిస్ బికు వ్యతిరేకంగా టీకా గురించి మరింత సమాచారం కొరకు మీ డాక్టరుతో మాట్లాడండి.

తిరిగి వెళ్ళండి
టీకా గురించి మరింత సమాచారంతో పాటు ఈ వ్యాధులను ఎలా నియంత్రించాలనే దానిగురించి పూర్తి సమాచారం కోసం దయచేసి మీ పిల్లల డాక్టరును సంప్రదించండి.