challange
challange
challange

పిల్లలకు టీకా వేయించడం ఆలస్యం చేయకూడదు ఎందుకంటే ఇది పిల్లలలో సంక్రమణల ప్రమాదంను పెంచడానికి దారితీయవచ్చు. సమయానికి టీకా వేయించడం ద్వారా సంభావ్య ప్రమాదకరమైన వ్యాధుల నుండి వారిని కాపాడవచ్చు.

టీకాను మర్చిపోవద్దు.

తద్వారా వ్యాధులను నివారించవచ్చు. బాల్యాన్ని కాదు.

18 సంవత్సరాల వయసు వరకు సిఫారసు చేయబడిన* టీకాల జాబితాను చూడడానికి క్రింది శీర్షికల మీద క్లిక్ చేయండి

డౌన్‌లోడ్

కోవిడ్-19 మహమ్మారి సమయంలో మీ బిడ్డకు వేయించని టీకా గురించి మీరు ఆందోళన చెందుతున్నారా?

క్రింద మీ సందేహాలకు సమాధానాలను పొందండి

1.నా బిడ్డకు ఏదైనా టీకాను మిస్సయ్యామో లేదో నాకు తెలీడం లేదు, నేను ఏమి చేయాలి? మరింత చదవండి
 • ప్రమాదకరమైన మరియు శక్తివంతమైన ప్రాణాంతక వ్యాధులకు వ్యతిరేకంగా వారిని కాపాడడానికి పిల్లలకు సమయానికి టీకా వేయించడం ముఖ్యం. సిఫారసుచేయబడిన టీకాకీకరణ నిర్దేశన ప్రకారం పిల్లలకు టీకాలను వేయించాలని వ్యాధి నియంత్రణ మరియు నివారణ కేంద్రాలు (సిడిసి) సిఫారసు చేస్తున్నాయి.
 • పిల్లలకు టీకాలు వేయించకపోతే లేదా టీకాలు జాప్యమైతే, టీకాతో తేలికగా నివారించగల ప్రమాదకరమైన వ్యాధుల నుండి వారికి రక్షణ లభించదు.
 • మీ బిడ్డకు సిఫారసు చేయబడిన వయసుతో నిర్దిష్టమైన టీకాలను కలిగి ఉన్న మీ బిడ్డ టీకా కార్డును ఈరోజే పరీక్షించండి. మిస్సయిన లేదా వేయించాల్సిన టీకాల గురించి మరింత సమాచారం కోసం పిల్లల వైద్యుడిని సంప్రదించండి.
2.కోవిడ్-19 మహమ్మారి సమయంలో మిస్సయిన/వేయించాల్సిన టీకాల కొరకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాలు ఏమిటి? మరింత చదవండి
 • ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యుహెచ్ఓ) ద్వారా ప్రపంచ మార్గదర్శకాలు: రోగనిరోధకత తప్పనిసరి ఆరోగ్య సేవ. తక్కువ సమయాల కోసమైనా, వ్యాధినిరోధకత సేవలకు భంగం వలన, వ్యాప్తి చెందే వ్యాక్సిన్ నివారించగల వ్యాధుల(విపిడిలు) సంఖ్య పెరుగుతుంది.
 • ఇండియన్ అకాడెమీ ఆఫ్ పెడియాట్రిక్స్(ఐఏపి) ద్వారా భారతీయ మార్గదర్శకాలు: సాంక్రమిక వ్యాధుల నివారణ(వ్యాధినిరోధకతలతో సహా) మరియు నిర్వహణను “ఆవశ్యకమైన వైద్య సేవ”గా భావించాలి, “సాధ్యమైనచోట, కోవిడ్-19 మహమ్మారి సమయంలో కొనసాగింపు కొరకు సాంక్రమిక రోగాల నివారణ మరియు పరిరక్షణ కోసం దానికి ప్రాముఖ్యతను ఇవ్వాలి. కోవిడ్-19 మహమ్మారి సమయంలో బాగా వ్యాధినిరోధకతను పొందిన బిడ్డ ప్రమాదానికి గురైనట్టుగా ఏ నమోదు లేదు.
3.ఈ సమయాలలో టీకాకీకరణ చేసేటప్పుడు తీసుకోవాల్సిన ముందుజాగ్రత్తలు/సంరక్షణ ఏమిటి?మరిన్ని చదవండి
 • ముందస్తు టీకాకీకరణ అపాయింట్మెంట్‌తో మాత్రమే మీ పిల్లల వైద్యుని వద్దకు వెళ్ళండి
 • ఆల్కహాలు-ఆధారిత సానిటైజర్‌ను తరచు విరామాలలో వాడండి
 • పసిపిల్లలు మినహా సంరక్షకులు మరియు పిల్లలందరూ మాస్క్ ధరించాలి
 • సాంఘిక దూరంను అన్నివేళలా కొనసాగించడం మరియు వీలైనంత వరకు ఉపరితలాలను ముట్టుకోకుండా ఉండాలి.
 • ఏ బొమ్మలు/వ్యక్తిగత వస్తువులను తీసుకువెళ్ళకండి మరియు డోర్ హ్యాండిల్స్ ముట్టుకోకుండా చూసుకోండి
 • డిజిటల్ చెల్లింపులను వీలైనంత వరకు చేయండి
 • సీనియర్ సిటిజన్లు(60 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు) టీకా వేయించుకునే వారితో పాటు వెళ్ళకూడదు.
 • సిబ్బంది సలహా మేరకు టీకా క్లినిక్ లో మీకు మీరుగా ప్రవేశించండి, నిష్క్రమించండి, వ్యవహరించండి.
4.నేను మా బిడ్డను టీకా కోసం బయటకు తీసుకువెళుతున్నాను, ఇది కోవిడ్-19 ప్రమాదంను పెంచుతుందా?మరింతగా చదవండి
 • ఆవశ్యకమైన వస్తువులు (పాలు, మందులు, మొదలైనవి) తేవడం కోసం మరియు సేవల కోసం(బ్యాంకింగ్, ఆరోగ్య సంరక్షణ, మొదలైనవి) బయటకు వెళ్ళేవారికి కూడా కోవిడ్-19 సంక్రమించే ప్రమాదం ఉంది. కానీ ఆవశ్యకమైన ముందు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రమాదాన్ని తగ్గించడానికి మేము ప్రయత్నిస్తున్నాము.
 • అదే విధంగా, టీకా అనేది ఒక ఆవశ్యకమైన వైద్య సేవ మరియు ఆవశ్యకమైన ముందు జాగ్రత్తలను తీసుకోవడం ద్వారా మీకు మరియు మీ బిడ్డకు సంక్రమణ ప్రమాదంను తగ్గించవచ్చు.
 • మరొకవైపు, పిల్లలకు టీకా వేయించకపోతే లేదా ఆలస్యం అయితే, టీకా ద్వారా నివారించగల ప్రమాదకర వ్యాధులకు వ్యతిరేకంగా వారికి రక్షణ ఉండదు.
 • మీ పిల్లల వైద్యుడిచే సూచించబడిన విధంగా సూచించిన టీకాలను తీసుకోవడం ఒక తెలివైన నిర్ణయం
5.మీ బిడ్డకు వేయించాల్సిన టీకా కొరకు అనుమతించదగిన జాప్యం ఏమిటి? మరింత చదవండి

మీ బిడ్డ టీకా నిర్దేశన కొరకు మిమ్మల్ని గైడ్ చేయడానికి మీ పిల్లల వైద్యులు ఉత్తమ సహకారాన్ని అందిస్తారు. మీ బిడ్డ టీకా కార్డును ఈ రోజే పరీక్షించండి మరియు మరింత సమాచారం కొరకు మీ పిల్లల వైద్యుడిని సంప్రదించండి.

టీకా ద్వారా 20 కన్నా ఎక్కువ ప్రాణాంతకమైన వ్యాధులను నివారించవచ్చు.

అనేక దేశాలలో చాలా టీకా-నివారణ వ్యాధులను బాగా తగ్గించడానికి టీకాలు దోహదపడినాయి. అయిననూ, ప్రజలు వాటికి సంబంధించిన టీకాలను తీసుకోవడం ఆపేస్తే, టీకాతో-నివారించగల వ్యాధులు తిరిగి రావడాన్ని మనం చూడవచ్చు.

టీకాలు వీటికి సహాయపడినాయి:

 • మశూచి నిర్మూలన
 • దాదాపుగా పోలియో నిర్మూలన
 • ప్రపంచవ్యాప్తంగా 2000 మరియు 2018 మధ్య తట్టుకు సంబంధించిన మరణాలు 73% తగ్గాయి.
 • 2000 మరియు 2018 మధ్య రూబెల్లా కేసులు 97% తగ్గాయి

సమాజానికి కూడా టీకాలు సహాయపడతాయి:

 • వ్యక్తులు- టీకాతో నివారించగల వ్యాధులకు వ్యతిరేకంగా రక్షణ కల్పించడం ద్వారా టీకాలు ఆరోగ్యం మరియు శ్రేయస్సును మెరుగుపరచవచ్చు, గతంలో పిల్లల మరణానికి ఇది సాధారణమైన కారణంగా ఉంది.
 • సంఘాలు- సంఘాలలో టీకాతో నివారించగల వ్యాధుల వ్యాప్తిని తగ్గించడంలో టీకా సహాయపడవచ్చు.
 • ఆర్థికవ్యవస్థలు – ఆర్థిక పురోగతి, ఉత్పాదకత మరియు శ్రామిక శక్తి(వర్క్ ఫోర్స్) పాల్గొనడం మీద ప్రయోజనకరమైన ప్రయత్నాలను టీకాకీకరణ కలిగి ఉంటుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
*ప్రపంచ ఆహార మరణాలు అంచనావేయబడిన 2000లో 536000 నుండి 2018లో 142,000 వరకు 73% తగ్గాయి.
**రూబెల్లా కేసులు 2000లో 102 దేశాలలోని 670894 కేసుల నుండి 2018లో 151 దేశాలలో 14621కు తగ్గాయని తెలపబడింది.


మిస్సయిన లేదా వేయించాల్సిన టీకా కోసం మీ పిల్లల వైద్యుడిని ఈరోజే సంప్రదించండి !


Share On
పైకి వెళ్ళండి

* Adapted from Advisory committee of vaccination & immunization practices, 2018-19 recommendations by Indian Academy of Pediatrics
Disclaimer: Information appearing in this material is for general awareness only and does not constitute medical advice.
The above vaccination list is not comprehensive and you may be advised additional vaccination based on your medical condition.
Please consult your Pediatrician for more information, question or concern you may have regarding your condition.
Issued in public interest by GlaxoSmithKline Pharmaceuticals Limited. Dr. Annie Besant Road, Worli, Mumbai 400 030, India.